ఆఫ్గనిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో సైనికులు నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా దాదాపు 50 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందారు, వీరితోపాటు ఇద్దరు సైనికులు కూడా మృత్యువాత పడ్డారు.
ఆఫ్గనిస్థాన్లోని చొరా జిల్లాని వివిధ ప్రాంతాల్లో సైనికులు మంగళవారం నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా దాదాపు 50 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందారని ఆఫ్గనిస్థాన్ గృహమంత్రిత్వశాఖ కార్యాలయం బుధవారం వెల్లడించింది.
చొరా జిల్లాలోనున్న తాలిబన్ ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు ఆఫ్గన్లోనున్ సైనికులు ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు 50 మంది దాకా మృతి చెందారు.
గడచిన ఇరవై నాలుగు గంటలలోపు ఇద్దరు ఆఫ్గనిస్థాన్ సైనికులు మృతి చెందారని వీరితోపాటు మరో ఆరుగురు సైనికులు తీవ్రంగా గాయాలపాలైనారని ఆ శాఖ తెలిపింది.