దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని కాందహార్ ప్రాంతంలో మంగళవారం ఓ బస్సు పేలిపోవడంతో అందులోనున్న దాదాపు 30 మంది మృతి చెందారు.
కాందహార్ ప్రాంతంలో ఓ బస్సు పేలిపోవడంతో 30 మంది మృతి చెందినట్లు ఆఫ్గనిస్థాన్ హోంశాఖ తెలిపింది. ఇందులో పది మంది పిల్లలు, ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని, మరో 39 మంది తీవ్ర గాయాల పాలైనట్లు ఆ శాఖ తెలిపింది.
ఈ దాడులు తాలిబన్ ఉగ్రవాదులే చేసి ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.