Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్గనిస్థాన్ ఎన్నికలతో సంతోషం: ఒబామా

Advertiesment
ఆఫ్గనిస్థాన్
FILE
ఆఫ్గనిస్థాన్‌లో ఇటీవల అధ్యక్ష ఎన్నికలు జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు.

ఆఫ్గనిస్థాన్‌లో జరుగుతున్న ఎన్నికలను అడ్డుకోవడానికి తాలిబన్లు దాడులకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఉగ్రవాదుల ఆగడాలకు ఈ ఎన్నికలు అడ్డుకట్ట వేస్తాయని ఆయన తెలిపారు.

ఆఫ్గనిస్థాన్ ప్రజలు తమ జీవితాన్ని చక్కబెట్టుకునేందుకుగాను అధ్యక్షుడిని ఎన్నుకున్నారని, ఇది ఎంతో శుభ పరిణామమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్కడ జరిగిన అధ్యక్షుని ఎన్నికల కారణంగా ఉగ్రవాదుల పనిని ఎవ్వరూ సమర్థించడంలేదనేది స్పష్టమైందని ఆయన అన్నారు.

ఉగ్రవాదుల హెచ్చరికలను లెక్క చేయకుండా అక్కడి ప్రజలు తమ తీర్పును ఇవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu