తమ ప్రభుత్వం త్వరలోనే అల్‌ఖైదాను మట్టుబెట్టేందుకు కొత్త రణనీతిని అవలంబించనుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు.
అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాదులను అంతమొందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా రణనీతి ప్రణాళికలను రూపొందిస్తోందని ఒబామా తెలిపారు.
ఉగ్రవాదంపై తానేమీ మాట్లాడనని, కాని అమెరికా మరియు దాని మిత్రదేశాలపై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వారిని అంతమొందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వ పరిపాలన స్థిరంగా ఉండాలనేదే తన ఉద్దేశ్యమని, అలాగే ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోను అక్కడి ప్రభుత్వాలు స్థిరంగా పరిపాలించాలనేదే తమ ధ్యేయమని, దీనికి తీవ్రవాదులు అడ్డు తగులుతున్నారని ఆయన తెలిపారు.