Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో అవమానం : కింగ్ ఖాన్

Advertiesment
బాలీవుడ్ నటుడు
FILE
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌కు అమెరికాలో అవమానం జరిగింది.

అమెరికాలోని నేవార్క్ విమానాశ్రయంలో షారూఖ్ ఖాన్‌ని విమానాశ్రయాధికారులు దాదాపు రెండు గంటలకు పైగా నిర్బంధించారు.

షారూఖ్ ఖాన్‌పై అనుమానంతోనే అతని పాస్‌పోర్టు, వీశా అంశాలపై అయనను ప్రశ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో ఆయనను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కింగ్ ఖాన్ మాట్లాడుతూ... తాను ఆసియన్‌ని అయినందుననే తనని కావాలేనే విమానాశ్రయాధికారులు ఇబ్బంది పెట్టారని ఖాన్ తెలిపారు. తాను

ఇక్కడ జరిగే భారత స్వాతంత్ర్య దినోత్సవాల వేడుకలలో పాల్గొనేందుకు తాను వచ్చానని ఆయన అన్నారు. దీంతో ఇక్కడి విమానాశ్రయాధికారులు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారని ఆయన వాపోయారు.

Share this Story:

Follow Webdunia telugu