వచ్చే యేడాది ఆఖరులో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా టెక్సాస్ గవర్నర్ రిక్ పెర్రీ పోటీ చేయనున్నారు. అధ్యక్ష పదవికి తాను అభ్యర్థిగా బరిలో దిగనున్నానని ఆయన ప్రకటించారు. స్థానిక కాంగ్రెస్ ప్రతినిధి మిచెల్లి బచ్‌మన్ హాజరైన ఒక విందు భేటీలో ఆయన ఈ ప్రకటన చేశారు.
వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామాకు ప్రధాన ప్రత్యర్థిగా బచ్‌మన్ బరిలోకి దిగనున్నారన్న వార్తలు ప్రచారంలో వున్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న మరో ఇద్దరు క్రైస్తవ మత పెద్దలతో ఆమె అవగాహన కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 17 వేల ఓట్లు పోలైన ఈ స్ట్రాపోల్‌లో బచ్‌మన్‌కు 4,823 ఓట్లు లభించాయి. అప్పటికి ఇంకా బరిలోకి రాని పెర్రీకి 718 ఓట్లు లభించటం విశేషం. ఈ విజయం బచ్‌మన్‌కు స్వల్ప సంతోషాన్ని మాత్రమే మిగిలించింది. ఇప్పుడు పెర్రీ బరిలోకి దిగటంతో నిజమైన రేసు ప్రారంభమైంది.