అమెరికాలో ప్రమాదకర స్వైన్ ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 263కి చేరింది. ఇదిలా ఉంటే స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 40 వేలపైకి చేరింది. ఇదిలా ఉంటే అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 4800 మంది స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. గత వారం స్వైన్ ఫ్లూ మరణాలు 211 వద్ద ఉండగా, ప్రస్తుతం అవి 263కి పెరిగాయని అమెరికా అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 37 వేల నుంచి 40 వేలకు చేరుకుంది. ఈ కేసులన్నింటినీ ల్యాబుల్లో ధృవీకరించారు. అమెరికా మొత్తం ఒక మిలియన్ మంది పౌరులు స్వైన్ ఫ్లూ వైరస్ బారినపడి ఉంటారని అధికారిక యంత్రాంగం భావిస్తోంది. చాలమందిపై వైరస్ పాక్షిక ప్రభావం మాత్రమే పడివుండవచ్చని భావిస్తున్నారు. వైద్యపరిశోధన కేంద్రాల్లో మాత్రం ఇప్పటివరకు 40 వేల కేసులను నిర్ధారించినట్లు అమెరికా అధికారిక యంత్రాంగం తెలిపింది.