Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్‌లో తిరగబడిన పడవ: ఇద్దరి మృతి

Advertiesment
పెద్ద పడవ
బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలోని ఓ నదిలో పెద్ద పడవ మునిగిపోవడంతో 180 మందికిపైగా ప్రయాణికులు గల్లంతైయ్యారు. దాదాపుగా ప్రయాణికులందరిని సహాయక సిబ్బంది రక్షించినప్పటికీ, ఇద్దరు ప్రయాణికులు మాత్రం మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఎనిమిదేళ్ల బాలికకాగా, ఈ ప్రమాదంలో 50 ఏళ్ల మహిళ కూడా మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి.

మునిగిపోయిన కొరోలినా డో నార్త్ అనే పెద్ద పడవ మనావస్ నగరంలోని నెగ్రో నది నౌకాశ్రయానికి తీసుకెళుతున్నారు. నదిలో తిరగబడిన ఈ పడవలో ఇంకా ఎవరైనా ప్రయాణికులు చిక్కుకొని ఉన్నారేమో తెలుసుకునేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. స్టీరింగ్ విరిగిపోవడంతో నదిలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై అధికారిక యంత్రాగం దర్యాప్తుకు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu