సామాజికవేత్త అన్నా హజారేకు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారత విద్యార్థులు మద్దతుగా నిలిచారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న హజారే పట్ల కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని వారు ముక్తకంఠంతో ఖండించారు. ఇదే అంశంపై వారు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి వినతిపత్రం కూడా సమర్పించారు. 35 మందితో కూడిన ఓ విద్యార్థి బృందం ఈ వినతి పత్రాన్ని సమర్పించింది.
ఈ విషయంలో వెంటనే కలుగజేసుకోవాలని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కోరారు. ప్రభుత్వం అవినీతిని అంతమొందించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా కాలరాస్తోందంటూ వారు ఆ వినతి పత్రంలో మండిపడ్డారు. అందుకే కేంద్రంలోని దేశాన్ని పాలించే నైతిక హక్కును ఈ ప్రభుత్వం కోల్పోయిందంటూ వారు మండిపడ్డారు.