ఇండో-యూఎస్ అణుఒప్పందాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది. ఈ అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా తొలి నివేదిను కాంగ్రెస్‌కు పంపించారు.
అమెరికాలోని గత ప్రభుత్వంలో బుష్ హయాంలో ఆగిపోయిన ఈ ఒప్పందాన్ని ఒబామా పునరుద్ధరించారని, అంతర్జాతీయంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం పరిధిలోనే ఇది అమలవుతుందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఒప్పందం వల్ల భారత్-అమెరికా సంబంధాలు పటిష్టవంతమవుతాయని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బెంజమిన్ ఛాంగ్ వివరించారు. ఈ ఒప్పందంపై ఒబామా తొలి నివేదికను యూఎస్ కాంగ్రెస్‌కు పంపించారని ఆయన తెలిపారు.
ఒబామా పంపిన నివేదికలో నిరుడు అక్టోబర్ 4 నుంచి 2009, జూన్ 30 వరకు జరిగిన అణు ఒప్పందం పరిణామాల తీరును అందులో వివరించినట్లు సమాచారం.