Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెనజీర్ భుట్టోను ఆమె భర్తే చంపించాడు : ముషార్రఫ్ (Video)

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బెనర్జీ భుట్టోను ఆమె భర్తే చంపించాడనీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బెనర్జీ భుట్టో 2007 డిసెంబరు నెల 27న తేదీన రావల్పిండిలో హత్యకు గురైన వి

Advertiesment
బెనజీర్ భుట్టోను ఆమె భర్తే చంపించాడు : ముషార్రఫ్ (Video)
, గురువారం, 21 సెప్టెంబరు 2017 (18:12 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బెనర్జీ భుట్టోను ఆమె భర్తే చంపించాడనీ ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బెనర్జీ భుట్టో 2007 డిసెంబరు నెల 27న తేదీన రావల్పిండిలో హత్యకు గురైన విషయం తెల్సిందే. 
 
ఈ హత్యకు సంబంధించి ముషార్రఫ్ తాజాగా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బెనజీర్ మృతికి కారణం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత అసిఫ్ జర్దారీ అని తన మెసేజ్‌లో పర్వేజ్ ఆరోపించారు. బెనజీర్ హత్య వెనుక తన పాత్ర ఉందని జర్దారీ ఆరోపిస్తున్నారని, అందుకే ఈ ప్రకటన చేయాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు. 
 
కాగా, బెనజీర్ కేసులో ఇటీవల యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పును వెలువరించింది. ఆ కేసులో పర్వేజ్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ముషర్రఫ్ ఈ ప్రకటన చేశారు. బెనజీర్ హత్యకు కారణమైన మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను ఎవరూ పట్టించుకోలేదని పర్వేజ్ తెలిపారు. బెనజీర్ కుటుంబంతో పాటు సింధు, పాకిస్థాన్ ప్రజలకు ఈ విషయం తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నట్లు పర్వేజ్ తెలిపారు. భుట్టో హత్య గురించి తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ సందేశం వర్తిస్తుందన్నారు. 
 
 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను హనీ, హృతిక్ డేరా అయితే బావుంటుంది... రాఖీ సావంత్