Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటికి బంధువులొస్తే.. తుపాకీతో కాల్పులు జరిపిన ఫ్లోరిడా మహిళ.. వెళ్ళిపోమని చెప్పినా?

అతిథిదేవో భవ అంటారు పెద్దలు. సాధారణంగా ఇంటికి అతిథులు వస్తే.. వారికి గౌరవం ఇవ్వడం మనదేశ సంస్కృతి. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో భారతీయులదే అగ్రస్థానం. అదే అతిథులు ఇంటికొచ్చి వెళ్ళిపోతే.. మరిన్ని రోజులు ఉం

Advertiesment
Woman Accused of Shooting at Guests Who Stayed Too Long
, గురువారం, 24 నవంబరు 2016 (13:21 IST)
అతిథిదేవో భవ అంటారు పెద్దలు. సాధారణంగా ఇంటికి అతిథులు వస్తే.. వారికి గౌరవం ఇవ్వడం మనదేశ సంస్కృతి. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో భారతీయులదే అగ్రస్థానం. అదే అతిథులు ఇంటికొచ్చి వెళ్ళిపోతే.. మరిన్ని రోజులు ఉండమని అడుగుతాం. కానీ అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. చుట్టాలను తరిమికొట్టేందుకు ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపింది. ఫ్లోరిడాలోని పనామా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అలానా అనెటే సావెల్‌(32) అనే మహిళ ఇంటికి సోమవారం ఇద్దరు బంధువులు వచ్చారు. వారంతా కలిసి మద్యం సేవించారు. కాసేపటి తర్వాత చుట్టాలను వెళ్లిపోవాలని సావెల్ కోరింది. ఆమె పదేపదే వెళ్లిపోమని చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
అంతే తాగిన మత్తుతో పాటు కోపంతో రగిలిపోయిన సావెల్ తనవద్ద ఉన్న తుపాకీతో అతిథులపై కాల్పులు జరిపింది. అంతే సావెల్ చర్యతో చుట్టాలు పారిపోయారు. ఈ క్రమంలో సావెల్ ప్రియుడిపైన కూడా కాల్పులకు పాల్పడింది. అయితే పోలీసులు సావెల్‌ను అరెస్ట్ చేశారు. కాల్పుల ఘటనలో ఎవరికీ ప్రాణహానీ జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ గాయపడిన వారు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దు మంచిది కాదనని అనను కానీ.. ప్రజాగ్రహం ఏ పార్టీకి లాభించదు : మన్మోహన్