Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగ్రరాజ్యంలో దారుణ పరిస్థితులు.. పెరుగుతున్న మృతులు.. 15 వేల ఫ్లైట్స్ రద్దు

winter storm
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (10:37 IST)
అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఫలితంగా అక్కడ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. న్యూయార్క్ నగరంతో పాటు బఫెలో నగరం ఇపుడు మంచు దుప్పటి కింద చిక్కుకుపోయింది. అలాగే, మంచులో చిక్కుకునిపోయిన కార్లలో ఒక్కో శవం బయటపడుతుంది. ఈ మంచు తుఫాను కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 60 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశ వ్యాప్తంగా 15 వేలకుపైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మంచు తుఫాను భీకరంగా విరుచుకుపడటంతో "ఈ శతాబ్దపు మంచు తుఫాను"గా అధికారులు అభివర్ణిస్తున్నారు. 
 
ఈ తుఫాను ధాటికి ఒక్క న్యూయార్క్ నగరంలోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తంగా 60 మందివరకు చనిపోయారు. మంచుతో కూరుకునిపోయిన బఫెలో నగరంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఇళ్లపై పేరుకునిపోయిన మంచును తవ్వి తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అమెరికాలోని ప్రధాన రహదారులతో పాటు బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులు మంచుతో నిండిపోయాయి. వీధులన్నీ తెల్లటి మంచుతో కప్పివున్నాయి. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒంటరిగా ఉండేవారితో పాటు అనారోగ్యంతో ఉండేవారికి వైద్యసేవలు కూడా అందించలేని దయనీయమైన పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
క్షతగాత్రులను హైలిఫ్ట్ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. బఫెలో నగరంలో మంచులో కూరుకునిపోయిన వాహనాల్లో మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ మంచు మంగళవారం కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏమాత్రం వాతావరణం అనుకూలించకపోవడంతో ఏకంగా 15 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ రాష్ట్ర సమితి ఆదాయం రూ.37 కోట్ల నుంచి రూ.218 కోట్లకు పెరుగుదల