Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో టోపీలతో తిరుగుతున్న పావురాలు.. (video)

Advertiesment
అమెరికాలో టోపీలతో తిరుగుతున్న పావురాలు.. (video)
, బుధవారం, 11 డిశెంబరు 2019 (16:44 IST)
అమెరికాలోని పావురాలు తలపై టోపీలను ధరించి ఎగురుతున్నాయి. రోడ్లపై పావురాలు టోపీలతో తిరుగుతున్న దృశ్యాలు చూసే వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, లాస్ వేగాన్ ప్రాంతానికి చెందిన పావురాలు కొన్ని ఎగురుతూ కనిపించాయి. ఈ పావురాలు ఎరుపు రంగుతో కూడిన కౌ-బాయ్ టోపీలను ధరించివున్నాయి. 
 
వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఆ టోపీలతో కూడిన పావురాలను కెమెరాల్లో ఫోటోలుగా, వీడియోలుగా బంధించారు. ఈ వ్యవహారంపై పక్షులకు సంబంధించిన పరిశోధకులు ఆరా తీస్తే.. ఎవరో పావురాలకు తగినట్లు టోపీలను సిద్ధం చేసి వాటికి తలపై అంటించినట్లు తెలుస్తోంది.
 
పావురాల తలపై గమ్‌తో టోపీలను అతికించడం ద్వారా వాటిని లాగడం వద్దని వదిలిపెట్టేసినట్లు తెలిసింది. అయినా కౌ-బాయ్ టోపీలను ధరించిన పావురాలను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీహార్‌ జైల్లో దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్, ‘నిర్భయ దోషులకి ఉరి వేయడానికే’ - ప్రెస్ రివ్యూ