Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీనివాస్ మృతిపై వైట్ హౌస్ నోరు విప్పింది.. కోర్టులో ప్యూరింటన్.. ఉరిశిక్ష?

అమెరికాలోని కన్సస్ కాల్పుల ఘటనపై వైట్ హౌస్ ఎట్టకేలకు నోరు విప్పింది. తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ మృతికి డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చిన వైట్ హౌస్.. వారం రోజుల తర్వాత స్పందించిం

Advertiesment
శ్రీనివాస్ మృతిపై వైట్ హౌస్ నోరు విప్పింది.. కోర్టులో ప్యూరింటన్.. ఉరిశిక్ష?
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (14:44 IST)
అమెరికాలోని కన్సస్ కాల్పుల ఘటనపై వైట్ హౌస్ ఎట్టకేలకు నోరు విప్పింది. తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ మృతికి డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చిన వైట్ హౌస్.. వారం రోజుల తర్వాత స్పందించింది. కన్సాస్ ఘటన కలవరపాటుకు గురిచేసిందని.. జాతి విద్వేష నేరాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్ ప్రకటించారు. 
 
ఇంకా అమెరికాలో జెవిష్ వర్గంపై జరుగుతున్న దాడుల్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక చట్టపరమైన విచారణ సంస్థలకు మించి తాను ముందుకు పోదలుచుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కాల్పుల విచారణ వేగవంతం చేయాలని అమెరికాలోని భారత దౌత్యం కార్యాలయం అమెరికా విదేశంగ శాఖకు లేఖ రాసింది. కన్సాస్ బార్‌లో భారతీయుడు జాతివివక్షచే భారత టెక్కీపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో టెక్కీ మరణించాడు.
 
ఈ నేపథ్యంలో కన్సాస్‌లోని ఓ పబ్‌లో జాత్యహంకార దాడికి పాల్పడి తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేయడంతో పాటు మరో ఇద్దరిని గాయపరిచిన కేసులో నిందుతుడైన ఆడమ్ ప్యూరింటన్‌ కోర్టుకు హాజరయ్యాడు. అమెరికా నావికాదళ మాజీ అధికారి అయిన ప్యూరింటన్‌ను తొలిసారిగా పోలీసులు సోమవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. 
 
విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలన్నింటికీ జంకూ గొంకూ లేకుండా ప్యూరింటన్ సమాధానమిచ్చాడని తెలుస్తోంది. ప్యూరింటన్ జాత్యహంకార నేరానికి పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో రుజువైతే ఆయనకు 50 ఏళ్ల జైలు శిక్ష లేదా ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు డిగ్రీ చదివారా? అయితే ఓటుకు వెయ్యి...!.. ఎక్కడ?