Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుద్ధాన్ని మీరు కానీ మేము కానీ తట్టుకోగలమా మోదీగారూ... ఇమ్రాన్ ఖాన్

యుద్ధాన్ని మీరు కానీ మేము కానీ తట్టుకోగలమా మోదీగారూ... ఇమ్రాన్ ఖాన్
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (19:13 IST)
తాజా దాడులు, విమానాల కూల్చివేత అనంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఇటు పాకిస్తాన్ కానీ అటు భారతదేశం కానీ తట్టుకునే పరిస్థితి లేదు... ఇపుడున్న ఆయుధాలను ఉపయోగిస్తే సంభవించే ఉపద్రవాలు ఎలాంటివో తెలియంది కాదు. 
 
ఒకవేళ యుద్ధమనేదే వస్తే తదుపరి పరిస్థితులు అటు మోదీగారు చేతుల్లో కానీ ఇటు నా చేతుల్లో కానీ వుండవు. అంతా నాశనమవుతుంది. గతంలో జరిగిన యుద్ధాలు మిగిల్చిన ఫలితాలు ఎలాంటివో అందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా యుద్ధం వైపు అడుగులు వేయాలా అంటూ ఇమ్రాన్ ప్రశ్నించారు.

పుల్వామా దాడికి సంబంధించి భారతదేశం వద్ద ఆధారాలు వుంటే తాము ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరం కల్పించే దేశంగా వుండాలని కోరుకోవడం లేదు. అది తమకు సుతారమూ ఇష్టం లేదంటూ తెలిపారు.
 
తీవ్ర వాద దాడులు తమ భూభాగం నుంచి జరుగుతున్నాయని నిరూపించే ఆధారాలు సమర్పిస్తే తక్షణ చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా వున్నామని తెలిపారు. సమస్యలన్నీ చర్చల ద్వారా పరిష్కారమవుతాయనీ, తాము దాన్నే కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలాగే తమ భూభాగంలోకి చొరబడి దాడులు చేస్తే, తమకూ ఆ బలం వున్నదని చెప్పేందుకే తమ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి వచ్చాయని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిలోఫర్ వైద్యుడి వేధింపులు.. నర్సు దుస్తులు మార్చుకుంటుంటే..?