విమానం టాప్ నుంచి నీళ్లు కారితే పరిస్థితి ఎలా ఉంటుంది? (video)
బస్సుల్లో వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఆ నీరు టాప్ నుంచి బస్సులోనికి రావడం చూసేవుంటాం. అయితే విమానం టాప్ నుంచి నీళ్లు కారితే పరిస్థితి ఎలా వుంటుంది? అబ్బే విమానం టాప్ నుంచి వర్షపు నీరు పడితే అంత ఖర్చు పె
బస్సుల్లో వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఆ నీరు టాప్ నుంచి బస్సులోనికి రావడం చూసేవుంటాం. అయితే విమానం టాప్ నుంచి నీళ్లు కారితే పరిస్థితి ఎలా వుంటుంది? అబ్బే విమానం టాప్ నుంచి వర్షపు నీరు పడితే అంత ఖర్చు పెట్టి విమానంలో ప్రయాణం చేయడం ఎందుకు? అనుకోకతప్పదుగా. అయినా అలాంటి పరిస్థితే ఓ ప్రయాణీకుడికి ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అట్లాంటా నుంచి ఫ్లోరిడా వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో తమ తమ సీట్లలో కూర్చొని ప్రయాణిస్తోన్న వారిపై నీళ్లు పడ్డాయి. వర్షపు చినుకులు పడుతున్నట్లు తమపై ఆ నీళ్లు పడుతుంటే ప్రయాణికులు షాకయ్యారు. ఇంటి రేకులకు కన్నాలు పడితే ఇళ్లల్లో నీరెలా కారుతారో విమానం టాప్ నుంచి ఇలా నీళ్లు కారడం ద్వారా ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.
ఇలా నీరు కారుతుంటే తమ వద్ద వున్న వస్తువులను తలపై పెట్టుకుని ప్రయాణీకులు కాసేపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి కూర్చున్న సీటుపై నీళ్లు పడుతున్నాయి. తన వద్ద ఉన్న మ్యాగజైన్‌ను ఆయన అడ్డుగా పెట్టుకున్నాడు. సదరు విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి గాను జరిమానా చెల్లించింది.