Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీఎండబ్ల్యూ కారులో నాగుపాము... బయటకు తీయడానికి ఏం చేశారో తెలుసా?

బీఎండబ్ల్యూ కారులో నాగుపాము... బయటకు తీయడానికి ఏం చేశారో తెలుసా?
, సోమవారం, 12 నవంబరు 2018 (15:31 IST)
బీఎండబ్ల్యూ కారులో ఆరు అడుగుల నాగుపాము దూరింది. ఈ విషయం కారులో ఇంధనం కొట్టించేందుకు పెట్రోల్ బంకు వద్దకు తీసుకుని రాగా అపుడు బంకు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఆ కారులోని నాగుపామును బయటకు రప్పించేందుకు కారులోని భాగాలన్నింటినీ విప్పాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, తమిళనాడుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన బీఎండబ్ల్యూ కారులో తిర్పూర్ నుంచి మదురైకు బయలుదేరారు. మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఆపి మూత్రవిసర్జన చేశారు. ఇంతలో ఓ పాము కారులోకి దూరేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి కారంతా వెతికించారు. 
 
అయినా పాము జాడ కనిపించకపోవడంతో బీఎమ్‌డబ్ల్యూ సర్వీసు సెంటర్ నుంచి నిపుణులను పిలిపించారు. అయినా పాము జాడలేదు. మళ్లీ డ్రైవింగ్ మెదలుపెట్టాక పాము కనపడటంతో కారును సర్వీస్ సెంటర్‌కు తరలించాలని నిర్ణయించారు. చివరికి పాములు పట్టేవారిని పిలిచి.. ముందుగా కారు టైర్లను ఊడతీసారు. కారు ఫ్రంట్ బంపర్ ఇతర పార్టలన్నీ పీకేశారు. బంపర్‌కు దగ్గరలో పాము ఇరుక్కొని పోయింది. దీంతో కారు ముందుభాగాన ఉన్న పార్ట్‌లు అన్నీటినీ విడదీయటంతో పాము కిందకు జారిపోయింది. స్నేక్ లవర్స్ సిబ్బంది పామును పట్టుకొని బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ మోడీనే... ఏపీలో వైకాపా గెలుస్తుందా? ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారు?