Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ప్రభుత్వం చేయలేని పని జనం చేశారు.. మాల్యాను దొంగ దొంగ అన్నారు.. ముఖం మాడ్చుకున్న మాల్యా

భారత్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన 420 పారిశ్రామిక జలగ విజయ్ మాల్యా సిగ్గు శరమూ ఏమాత్రం తన ఒంట్లో ఉంటే ఇకపై లండన్‌లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగే స్టేడియాల్లోకి ఇకపై అడుగుపెట్టడు. ఆదివారం భారత్, దక్షిణాఫ్

భారత ప్రభుత్వం చేయలేని పని జనం చేశారు.. మాల్యాను దొంగ దొంగ అన్నారు.. ముఖం మాడ్చుకున్న మాల్యా
హైదరాబాద్ , సోమవారం, 12 జూన్ 2017 (00:40 IST)
భారత్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన 420 పారిశ్రామిక జలగ విజయ్ మాల్యా సిగ్గు శరమూ ఏమాత్రం తన ఒంట్లో ఉంటే ఇకపై లండన్‌లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగే స్టేడియాల్లోకి ఇకపై అడుగుపెట్టడు. ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోపీ పోటీని చూడడానికి వచ్చిన విజయ్ మాల్యా జీవితంలో ఎన్నడూ ఎరగని అవమానాన్ని పొందారు.

లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్ మైదానంలో అడుగుపెట్టడానికి వచ్చిన మాల్యాను చూసి టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా దొంగ, దొంగ అని అరుస్తూ చుట్టుముట్టారు. ఒక్కసారిగా షాక్ తిన్న మాల్యా వేగంగా స్టేడియంలోకి వెళ్లిపోయారు. భారత ప్రభుత్వానికి సాధ్యం కాని పనిని భారత ప్రజలు, టీమిండియా అభిమానులు చేయడం విశేషం. ఇకపై లండన్ లోని స్టేడియాల్లోకి మాల్యా రాజసంగా అడుగుపెట్టలేడని తేలిపోయింది.
 
విషయంలోకి వస్తే.. భారత ప్రభుత్వాన్ని, బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో సైటర్లతో మాల్యాపై విరుచుకుపడుతున్న సామాన్య జనం నేరుగా ఆయనకు ఝలక్‌ ఇచ్చారు. ఊహించని పరిణామంలో మాల్యా ఒక్కసారిగా బిత్తరపోయారు. 
 
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను తిలకించేందుకు లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్ మైదానానికి వచ్చారు. నీలం రంగు సూటులో మెరిసిపోతూ స్టేడియం లోపలికి వెళుతున్న మాల్యాను చూసి టీమిండియా ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ‘దొంగ, దొంగ’ అంటూ కేకలు వేస్తూ ఆయనను చుట్టుముట్టారు. ఊహించని పరిణామంలో షాక్‌ తిన్న మాల్యా వడివడిగా స్టేడియం లోపలకు వెళ్లిపోయారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోర్న్ సైట్లు చూసి అడ్డంగా బుక్కైన అమెరికా ప్రజా ప్రతినిధి..