కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు... గమ్మత్తేంటంటే... 18 యేళ్ల తర్వాత వెలికి తీశారు!
వియత్నాం వైద్యులు ఓ రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు. ఇక్కడ గమ్మత్తేంటంటే.. దాన్ని 18 ఏళ్ల తర్వాత గుర్తించి తొలగించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... వియత్నాంకి చెందిన మా వాన్‌హత్
వియత్నాం వైద్యులు ఓ రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు. ఇక్కడ గమ్మత్తేంటంటే.. దాన్ని 18 ఏళ్ల తర్వాత గుర్తించి తొలగించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... వియత్నాంకి చెందిన మా వాన్‌హత్ అనే వ్యక్తి 1998లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు బాక్‌కాన్ ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు అతని కడుపుకి శస్త్రచికిత్స చేశారు. అదేసమయంలో చూసుకోకుండా కత్తెరపెట్టి కుట్లు వేసేశారు.
ఇప్పుడు వాన్‌హత్‌కి 54 ఏళ్లు. కడుపులో అంత పొడుగు కత్తెర ఉన్నా వాన్‌హత్ సాధారణ జీవితాన్నే గడిపాడు. ఇటీవల అతనికి తీవ్ర కడుపునొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. సమస్యేంటో తెలీడానికి వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. అప్పుడే వాన్‌హత్ కడుపులో 15 సెంటీమీటర్ల పొడవున్న కత్తెర ఉన్నట్టు గుర్తించారు.
వెంటనే వైద్యులు దాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు కత్తెరను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం వాన్‌హత్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇక్కడ మరో గమ్మత్తేంటంటే... 1998లో వాన్‌హత్‌కు శస్త్రచికిత్స చేసిన వైద్యుడి కోసం గాలింపు జరుపుతున్నామని అధికారులు చెప్పడం.