Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం.. అమెరికా చట్టసభలో బిల్లు

భారత సైనికులపై ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఉరీ దాడిలో 18 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా పాకిస్థాన్‌ను పరిగణించాలని కోరుతూ అమెరికా

Advertiesment
US lawmakers move bill to designate Pakistan as a terrorist state
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:08 IST)
భారత సైనికులపై ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఉరీ దాడిలో 18 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా పాకిస్థాన్‌ను పరిగణించాలని కోరుతూ అమెరికా చట్టసభలోని ఇద్దరు సభ్యులు యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు.

ఈ మేరకు ‘పాకిస్థాన్‌ స్టేట్‌ స్పాన్సర్‌ ఆఫ్‌ టెర్రరిజం డిజిగ్నేషన్‌ యాక్ట్‌’ (హెచ్‌ఆర్‌ 6069) బిల్లును సభలో ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌ పాల్పడుతున్న చర్యల కారణంగా ఆ దేశానికి అమెరికా సాయం నిలిపేయాలని.. పాక్‌ను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా గుర్తించాలని టెడ్‌ పోయ్‌ తెలిపారు. 
 
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉండి.. హాయిగా నెట్‌వర్క్‌ను పెంచుకోవడాన్ని బట్టి ఉగ్రవాదంపై పోరు అంశంలో పాకిస్థాన్‌ వైఖరి ఎలాంటిదో తెలుసుకోవడానికి ఇదొక్కటే చాలునని టెడ్ ఆరోపించారు. ఈ ప్రశ్నకు ఒబామా ప్రభుత్వం అధికారికంగా సమాధానం చెప్పాలని బిల్లులో కోరారు.

పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తుందో, లేదో తెలియజేస్తూ 90 రోజుల్లో అధ్యక్షుడు నివేదిక ఇవ్వాలని టెడ్‌ కోరారు. తర్వాత ఫాలోఅప్‌ రిపోర్ట్‌లు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రైల్వే బడ్జెట్ కు మంగళం'... సాధారణ బడ్జెట్‌లోనే.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం