Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో డోనాల్డ్ ట్రంప్ ... మొదలైన రిపబ్లికన్ల విజయ సంబరాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. గంట గంటకూ చేతులు మారుతున్న ఆధిక్యం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో, మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలోకి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చారు.

Advertiesment
US election live
, బుధవారం, 9 నవంబరు 2016 (10:29 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. గంట గంటకూ చేతులు మారుతున్న ఆధిక్యం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో, మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలోకి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చారు. మ్యాజిక్ ఫిగర్ 270 కాగా... ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం... ఎలక్టోరల్ కాలేజీలో ప్రస్తుతం 254 ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు హిల్లరీ 215 ఓట్లతో వెనుకబడిపోయారు. 
 
ఎన్నికల ఫలితాల్లో మొదట ట్రంప్ ఆధిక్యంతో నిలువగా... కాసేపటి తర్వాత హిల్లరీ ముందంజలో నిలిచారు. ఆ తర్వాత దూసుకుపోయిన ట్రంప్... ఒకానొక సమయంలో ఏకంగా 57 ఓట్ల ఆధిక్యతను సాధించారు. కాలిఫోర్నియా రాష్ట్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆధిక్యంలోకి దూసుకుపోయిన హిల్లరీ... ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయారు.
 
మరోవైపు... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయం కావడంతో రిపబ్లికన్ ప్రతినిధులు, ట్రంప్ అభిమానులు, ఆయన ప్రచార బృందం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఒకరిని ఒకరు అభినందనలు తెలుపుకుంటున్నారు. ప్రస్తుతం 454 చోట్ల ఫలితాల సరళి వెలువడగా, ట్రంప్ 244 చోట్ల, క్లింటన్ 210 చోట్ల విజయం దిశగా సాగుతున్నారు. ట్రంప్‌కు స్పష్టమైన ఆధిక్యం, లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 84 చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా, అక్కడ కనీసం 30 చోట్ల విజయం సాధిస్తే, ట్రంప్ శ్వేతసౌథాధిపతి అయినట్టే. ప్రస్తుతమున్న సరళి చూస్తుంటే అదేం పెద్ద సమస్యేమీ కాదని, ట్రంప్ విజయం ఖాయమని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దు.. కొండపై భక్తుల కష్టాలు.. నోట్ల మార్పిడికి తంటాలు..