Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ రక్తం ఉరకలేస్తోంది... పాకిస్థాన్‌ పని పడుతుంది : యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ వార్నింగ్

అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ విన్సెంట్ స్టెవార్ట్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. పాకిస్థాన్‌ను శిక్షించేందుకు భారత్ రక్తం ఉరకలేస్తోందంటూ చెప్పారు. ముఖ్యంగా ప్రపంచదేశాల ముందు దౌత్యపరం

Advertiesment
US Defense Intelligence Agency chief Lieutenant General Vincent Stewart
, బుధవారం, 24 మే 2017 (10:25 IST)
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ విన్సెంట్ స్టెవార్ట్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. పాకిస్థాన్‌ను శిక్షించేందుకు భారత్ రక్తం ఉరకలేస్తోందంటూ చెప్పారు. ముఖ్యంగా ప్రపంచదేశాల ముందు దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేసే దిశగా విజయవంతమైన అడుగులు వేస్తున్న ఇండియా, ఆ దేశాన్ని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా భావిస్తోందని ఆయన వెల్లడించారు. 
 
కాశ్మీరులో హింస కొనసాగుతోందని, ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతూ, గతంలో ఎన్నడూ లేనంత కింది స్థాయికి భారత్, పాక్ మధ్య బంధం పడిపోయిందని విన్సెంట్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు ఇండియాలో పెరిగిపోవడంతో, అందుకు దీటైన సమాధానాన్ని చెప్పాలన్న ఒత్తిడి ప్రజల నుంచి వస్తోందని, అందుకు తగ్గట్టుగానే సైన్యం అడుగులు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ప్రధానంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ నుంచి లభిస్తుందన్న ఆరోపణలతోనే భారత్ చర్యలు ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని శక్తిమంతమైన కమిటీల్లో ఒకటైన సెనెట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ముందు మాట్లాడిన ఆయన, పాకిస్థాన్ సైతం వెనక్కి తగ్గే ఆలోచనలో లేదని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ పోస్టులపై తాము దాడులు చేశామని చెబుతూ, భారత సైన్యం ఓ వీడియోను విడుదల చేసిన మరుసటి రోజే విన్సెంట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త వెన్నెముకకు శస్త్రచికిత్స.. ఆస్పత్రికి ఆటోలో వెళ్ళిన భార్య.. డ్రైవర్ అత్యాచారం