Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా వాసులకు ముక్కలేనిదే ముద్ద దిగదట.. మరి భారతీయుల పరిస్థితేంటి?

అమెరికా వాసులకు ముక్క లేనిదే ముద్ద దిగడం లేదట. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఒక అమెరికా పౌరుడు ఒక యేడాదిలో సగటున 126.6 కిలోల మాంసాన్ని లాంగించేస్తున్నట్టు ఐరాస నివేదిక ఒకటి వెల్లడించింది.

Advertiesment
UN report
, శుక్రవారం, 4 నవంబరు 2016 (11:22 IST)
అమెరికా వాసులకు ముక్క లేనిదే ముద్ద దిగడం లేదట. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఒక అమెరికా పౌరుడు ఒక యేడాదిలో సగటున 126.6 కిలోల మాంసాన్ని లాంగించేస్తున్నట్టు ఐరాస నివేదిక ఒకటి వెల్లడించింది. మరి భారత్ మాత్రం భారత్ 5.1 కిలోల తలసరి వినియోగంతో ఈ జాబితాలో 169వ స్థానంలో నిలిచింది. 
 
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వెల్లడించిన 'ద స్టేట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్' నివేదికలో కేవలం లగ్జెంబర్గ్, హాంకాంగ్ ప్రజలు మాత్రమే మాంసం వినియోగంలో అమెరికా కంటే ముందున్నారని తేలింది. ఇది లగ్జెంబర్గ్‌లో 142.5 కిలోలుగా ఉండగా.. హాంకాంగ్‌లో 134 కిలోలుగా ఉంది. బ్రిటన్‌ 83.9 కిలోల మాంసం వినియోగంతో 25వ స్థానంలో నిలిచింది.
 
175 దేశాలతో విడుదల చేసిన ఈ జాబితాలో ఇక అతితక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇక్కడ ఏడాది కాలంలో తలసరి వినియోగం 3.1 కిలోలుగా ఉంది. బురుండీ, కాంగోలు 3.7, 4.6 కేజీలతో బంగ్లాదేశ్ తర్వాత తక్కువ వినియోగిస్తున్న దేశాలుగా నిలిచాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో లవ్ ఫెస్టివలా.. బికినీలతో బీచ్ ఫిస్టివలా? బ్రాహ్మణి స్పందించాలి: రోజా