అణు పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా... ఆ పని చేస్తే దాడి చేస్తామంటున్న అమెరికా
ఉత్తరకొరియా మరో అణు పరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి (ఏప్రిల్ 15) సందర్భంగా ఈ అణు ప్రయోగం నిర్వహించవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉత్తరకొరియా మరో అణు పరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి (ఏప్రిల్ 15) సందర్భంగా ఈ అణు ప్రయోగం నిర్వహించవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. జయంతి సందర్భంగా భారీ మిలటరీ డ్రిల్ నిర్వహిస్తే ఫర్వాలేదని... అణు పరీక్ష నిర్వహిస్తే మాత్రం సిరియాపై దాడి చేసినట్టుగానే, ఉత్తరకొరియాపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరిస్తోంది. దీంతో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం తప్పేలా లేదు.
మరోవైపు అమెరికా బెదిరింపులకు ఏమాత్రం భయపడే ప్రసక్తే లేదని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. తాము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి ఆయన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
దీనికితోడు ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. భవిష్యత్తులో ఉత్తరకొరియా, దక్షిణకొరియా ఏకమవుతాయని... ఆ దేశానికి కూడా తానే అధ్యక్షుడిని ఆయన జోస్యం చెప్పారు కూడా. ఈ సంగతి ఏమోగానీ... ఉ.కొరియా చర్యల వల్ల ప్రపంచంలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.