Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసిస్‌పై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్... అమెరికా ప్రయోగం... నేలపై పడిందో అంతే...

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)పై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. ఆప్ఘనిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబును ‘మదర్ ఆఫ్

ఐసిస్‌పై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్... అమెరికా ప్రయోగం... నేలపై పడిందో అంతే...
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (09:26 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)పై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. ఆప్ఘనిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబును ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలుస్తారు. ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ అణు రహిత బాంబును ప్రయోగించింది. ఐఎస్ టెర్రరిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే తూర్పు ఆప్ఘానిస్థాన్‌లోని నంగర్హార్‌లో ఈ బాంబును జార విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం వెల్లడించింది. 
 
ఎంసీ-130 అనే విమానం నుంచి జీబీయూ-43 అనే ఈ బాంబును అమెరికా ప్రయోగించింది. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని అచిన్‌ జిల్లాలో ఉన్న ఐసిస్‌ ‘‘టన్నెల్‌ కాంప్లెక్స్‌’’పై జీబీయూ-43/బీ బాంబును అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా బలగాలు ప్రయోగించాయి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:32 గంటలకు ఈ దాడి జరిగింది. 21,600 పౌండ్లు (9797 కిలోలు) బరువుండే ఈ భారీ బాంబును అన్ని బాంబులకు తల్లిగా పిలుస్తారు.
 
యుద్ధం లేని సమయంలో అమెరికా ఈ స్థాయి బాంబును ప్రయోగించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 10 టన్నుల బరువైన ఈ బాంబు ప్రభావం వల్ల 300 చదరపు మీటర్ల ప్రాంతం పూర్తిగా కాలి బూడిదవుతుంది. దాదాపు 4 చ.కి.మీ. మేర ఈ బాంబు ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019లో పులివెందులకే సీఎం పదవి.. అధికారంలోకి రాగానే మీ తాట తీస్తా?