Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ కోసం కుక్క చెవులను కోసేశారు... ఇంత దారుణమా?

సెల్ఫీ మోజులో పడిన యువత మూగజీవులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా టర్కీలో ఇద్దరు యువకులు అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. సెల్ఫీ కోసం ఓ కుక్క చెవులు కత్తిరించాడు. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో

Advertiesment
Turkish Men
, బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (14:31 IST)
సెల్ఫీ మోజులో పడిన యువత మూగజీవులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా టర్కీలో ఇద్దరు యువకులు అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. సెల్ఫీ కోసం ఓ కుక్క చెవులు కత్తిరించాడు. ఈ వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క చెవులు కత్తిరించిన వారి సమాచారం ఇస్తే 2500 డాలర్లు ఇస్తామని 'ది మిచిగాన్‌ హ్యూమన్‌ సొసైటీ' ప్రకటించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆ తర్వాత రక్తమోడుతున్న ఆ కుక్క పక్కనే ఓ చేతిలో కుక్క చెవిని, మరో చేతిలో కత్తిని పట్టుకుని ఫొటోకు పోజిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని 1150 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు సమాజం ఎటువైపు వెళ్తొందని విచారం వ్యక్తంచేస్తున్నారు. 
 
ఇలాంటి దారుణాలు ఇస్పర్టలోనే కాదు మూగజీవుల్ని హింసించిన ఇలాంటి సంఘటనలే కొద్ది రోజుల క్రితం మన దేశంలోని చెన్నైలో బయటపడిన సంగతి తెలిసిందే. సరదా కోసం మూగజీవులను హింసించడం ఎక్కువైందనడానికి నిదర్శనం పరిపాటిగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిఘాలో బయటపడ్డ మన్నార్గుడి మాఫియా ముఠా గుట్టు .. అందుకే శశికళను మోడీ నమ్మడం లేదట!