Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌లో ఇద్దరు సిక్కులను కాల్చివేత

Advertiesment
gun shot
, సోమవారం, 16 మే 2022 (12:41 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు సిక్కు పౌరులను కాల్చి చంపేశారు. ఈ దారుణం పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఇద్దురు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి సల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38) అనే ఇద్దురు సిక్కు వ్యాపారులను కాల్చి చంపేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యాపారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ సిక్కు వ్యాపారుల హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రగా ఈ ఘటనను ఆయన అభినందించారు. కాగా, పెషావర్‌లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు వ్యాపారులో కావడం గమనార్హం. 
 
ఈ వ్యాపారులపై దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. గత యేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హుకీం, అంతకుముందు యేడాది ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న రవీందర్ సింగ్‌, 2018లో ప్రముఖ సిక్కు నేత చరణ్ జీత్ సింగ్, 2016లో జాతీయ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో అదుపులో ఉన్న కరోనా వైరస్