Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రంప్ ట్వీట్లు మంచివే.. ఆపలేం.. మూసిన గదిలో మాట్లాడటం కంటే?: జాక్ డోర్సే

అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ట్వీట్లపై ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. ట్రంప్ ట్వీట్లను ఆపే ప్రసక్తే లేదని డోర్సే స్పష్టం చేశారు. ట్విట్టర్ యూజర్లు 328 మిలియన్లకు పెరగడానికి కారణం ట్రంప్

ట్రంప్ ట్వీట్లు మంచివే.. ఆపలేం.. మూసిన గదిలో మాట్లాడటం కంటే?: జాక్ డోర్సే
, శుక్రవారం, 12 మే 2017 (16:19 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందేందుకు ట్విట్టర్లో ఆయన చేసిన ప్రచారం బాగా పనిచేసిందని టాక్ వుంది. సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారానే తనను విజయం వరించిందని ఎన్నో సందర్భాల్లో ట్రంప్ సన్నిహితులతో చెప్పారట. ట్విట్టర్లో ట్రంప్ పోస్టులు వివాదాస్పదం కావడం ద్వారా అందరి నోళ్ళలో ఆయన నానారు. అలా ఫేమస్ అయి.. అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ట్వీట్లపై ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. 
 
ట్విట్టర్లో ట్రంప్ కూతలు తట్టుకోలేకపోతున్నామని.. ఆయన ట్వీట్లను ఆపాల్సిందిగా ఎందరో విజ్ఞప్తి చేశారని.. కానీ ట్రంప్ ట్వీట్లను ఆపే ప్రసక్తే లేదని డోర్సే స్పష్టం చేశారు. ట్విట్టర్ యూజర్లు 328 మిలియన్లకు పెరగడానికి కారణం ట్రంప్ ట్వీట్లేనని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు చేసే ట్వీట్లు చాలా ముఖ్యమైనవని... అసలు ఆయనేం చెప్పాలనుకుంటున్నారో.. దాన్ని వినాల్సిన అవసరం ముఖ్యమన్నారు. 
 
ట్వీట్ చేయకుండా ఆయనను ఆపాలని ఎవరూ భావించకూడదని అన్నారు. ట్రంప్ ట్వీట్లు కొన్నిసార్లు నొచ్చుకునే విధంగా ఉన్నప్పటికీ.. అవన్నీ మన మంచికేనని తెలిపారు. ట్వీట్ చేయకుండా ట్రంప్‌ను ఆపలేమని స్పష్టం చేశారు. తలుపులు మూసిన గదిలో మాట్లాడటం కంటే బహిరంగంగా చర్చించుకోవడమే మేలని తాను భావిస్తున్నట్లు డోర్సే చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోట్లాది ఫోన్ కాల్స్ కట్ అవుతున్నాయ్.. ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌పై జియో ఫిర్యాదు..