టర్కీలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు

శనివారం, 25 జనవరి 2020 (09:07 IST)
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి వచ్చిన ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 20 మంది చనిపోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. 
 
తూర్పు టర్కీలోని ఇలాజిజ్ ప్రావిన్స్‌, సివ్‌రిన్ జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. భూప్రకంపనలు మొదలుకాగానే జనం భయంతో వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. స్వల్ప కాలంలోనే 60 ప్రకంపనలు నమోదైనట్టు టర్కీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.
 
భూకంపం ధాటికి కూలిన భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాల కింద 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా, సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జగన్ వద్దకు వెళ్లాల్సిన ఖర్మ లేదు.. ఆ మాట ఎవరు.. ఎందుకన్నారో తెలుసా?