ఇక ఓపిక లేదు.. ఉ.కొరియాను పీస్.. పీస్ చేసేస్తాం: జిన్ పింగ్‌తో డోనాల్డ్ ట్రంప్
ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ నడుంబిగించారు. ఇందులోభాగంగా, ఆయన ఉ కొరియా మిత్రదేశమైన చైనాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు కట్టడి చేస్తే సరేసరి.. లేదంటే ఉ కొరి
ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ నడుంబిగించారు. ఇందులోభాగంగా, ఆయన ఉ కొరియా మిత్రదేశమైన చైనాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు కట్టడి చేస్తే సరేసరి.. లేదంటే ఉ. కొరియాను పీస్ పీస్ చేసేస్తామంటూ చైనా అధ్యక్షుడు జింగ్ పిన్‌కు ట్రంప్ తేల్చి చెప్పారు.
జి20 శిఖరాగ్ర దేశాల సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమైన వేళ ప్రధానంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పైనే చర్చించారు. ఆ దేశాన్ని కట్టడి చేయాలని కోరారు. వారి దూకుడును భరించే ఓపిక తనకిక లేదని స్పష్టం చేశారు. ఏదైనా చేసి, కొరియా అధ్యక్షుడిని కట్టడి చేయాల్సిందేనని ట్రంప్ సూచించినట్టు తెలుస్తోంది. జింగ్ పిన్, డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య సుదీర్ఘ సమయం ఉత్తర కొరియా దూకుడుపైనే చర్చ జరిగింది.