Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Advertiesment
deadbody

ఐవీఆర్

, సోమవారం, 24 మార్చి 2025 (22:22 IST)
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎక్కిన దగ్గర్నుంచి అమెరికా ఎన్నారైలకు గడ్డుకాలం దాపురించినట్లు కనబడుతోంది. కఠినమైన ఆంక్షలతో అక్కడ పనిచేస్తున్న విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం వర్తిస్తున్న నిబంధనల దెబ్బకు లక్షల్లో ఉద్యోగుల ఉద్యాగాలు ఊడిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో కొలువు కలలు కన్నవారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చాలామందికి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.
 
ఇలా జరుగుతుండటంతో కొంతమంది ధైర్యం చేసి స్వదేశాలకు వెళ్లిపోయి చిన్నాచితక ఉద్యోగాలు చేసి బతుకుతున్నారు. కానీ కొంతమంది మాత్రం అమెరికాను వదిలేసి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దీనితో కొందరికి ఉద్యోగాలు పోయి ఖాళీగా ఇంటి వద్దే కూర్చుని వుంటున్నారు. ఇలాంటివారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఫలితంగా కొందరు బలన్మరణానికి పాల్పడుతున్నారు.
 
గుడివాడకి చెందిన అభిషేక్ అనే వ్యక్తి గత ఏడాదిలో వివాహం చేసుకుని భార్యను అమెరికా తీసుకుని వెళ్లాడు. ఐతే అక్కడ పరిస్థితులు గందరగోళంగా వుండటమూ, గత ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడం ఒకవైపు కలిసి అతడు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడిని అమెరికా నుంచి వచ్చేయమని చెప్పినప్పటికీ అతడు వినలేదని అతడి తల్లిదండ్రులు బోరుమంటూ విలపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?