Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశీయులకు అదనపు వీసాలు.. కార్మికుల కోసం.. 15వేల వీసాలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్లెవేస్తున్న ‘హైర్ అమెరికన్’ నినాదానికి సంబంధం లేకుండా.. విదేశీయులకు 15,000 అదనపు వీసాలను ఇవ్వాలన్న నిర్ణయాన్ని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. మత్స్య పరిశ

విదేశీయులకు అదనపు వీసాలు.. కార్మికుల కోసం.. 15వేల వీసాలు..
, బుధవారం, 19 జులై 2017 (18:27 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్లెవేస్తున్న ‘హైర్ అమెరికన్’ నినాదానికి సంబంధం లేకుండా.. విదేశీయులకు 15,000 అదనపు వీసాలను ఇవ్వాలన్న నిర్ణయాన్ని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. మత్స్య పరిశ్రమ కేంద్రాలు, ఆతిథ్యం తదితర పరిశ్రమల నుంచి తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కోసం ఒత్తిడి పెరగడంతో ఈ వీసాలను ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 
 
సీఫుడ్స్, టూరిజం, నిర్మాణం తదితర సీజనల్ పరిశ్రమలకు కావలసిన తాత్కాలిక కార్మికులను సమకూర్చడానికి ఇలా వీసాల సంఖ్య పెంచారు. ఆయా రంగాల్లో వ్యవసాయ ప్రయోగశాలల రంగం లేదు. ఈ అదనపు వీసాల దరఖాస్తు కార్యక్రమం త్వరలో మొదలవుతుంది. అమెరికా కార్మికులను రక్షించడానికి, అమెరికాలోకి వలసల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపకరించే నిర్ణయం ఇదని వైట్‌హౌస్ ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంట్ క్యాంటీన్‍‌ పొంగల్‌లో స్పైడర్...