పొలంలో ఆటాడుకుంటుంటే.. ఎలుగుబంటి వచ్చిందని.. అలా ఎలుగుబంటితో వెళ్లిపోయాడు ఓ బుడ్డోడు. అమెరికా, ఉత్తర కరోలినాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల క్యాసీ హ్యాథనేని దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లింది.. వాళ్ల నాన్నమ్మ. అక్కడ మరో ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ క్యాసీ కనిపించకుండాపోయాడు.
కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటుకు ఎంత వెతికినా పిల్లాడు కనిపించకుండాపోయాడు. పొలంలో ఆటాడుకుంటుంటే.. ఎలుగుబంటి వచ్చిందని.. తనతో వెళ్లానని చెప్పాడు. రెండు రోజుల పాటు ఎలుగుబంటితో ఆడుకున్నానని, ఆకలి వేసినప్పుడు ద్రాక్షా పండ్లను తిన్నానని తెలిపాడు. తిరిగి ఆ ఎలుగుబంటే పొలం దగ్గర వదిలేసిందని చెప్పాడు.
ఈ విషయాన్ని క్యాసీ కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోయారు. అరుదైన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.