Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాగ్ డాల్ఫిన్ ప్రాణస్నేహితులు.. డాల్ఫిన్‌ కోసం స్విమ్ చేస్తూ 3 గంటల సేపు ఆడుకుంటూ.. (వీడియో)

అవి రెండు మూగ జీవులు. ఒకటి నీటి నుంచి బయటకు వస్తే కదలిక లేకపోతుంది. మరొకటి నీటిలో ఎక్కువసేపు ఉండటానికి కుదరని జీవి. కానీ వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. కనీసం రోజులో ఒక్కసారైనా ఇద్దరి కలిసి సరదాగా

డాగ్ డాల్ఫిన్ ప్రాణస్నేహితులు.. డాల్ఫిన్‌ కోసం స్విమ్ చేస్తూ 3 గంటల సేపు ఆడుకుంటూ.. (వీడియో)
, ఆదివారం, 20 నవంబరు 2016 (12:04 IST)
అవి రెండు మూగ జీవులు. ఒకటి నీటి నుంచి బయటకు వస్తే కదలిక లేకపోతుంది. మరొకటి నీటిలో ఎక్కువసేపు ఉండటానికి కుదరని జీవి. కానీ వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. కనీసం రోజులో ఒక్కసారైనా ఇద్దరి కలిసి సరదాగా ఆడుకోవాల్సింది. ఒకరు రాలేదంటే.. మరొకరికి ఏమీ తోచదు.

రెండు మూగజీవుల మధ్య పెనవేసుకున్న ఆ స్నేహం ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆ మూగజీవుల్లో ఒకటి డాల్ఫిన్ అయితే మరొకటి శునకం. వినేందుకు వింతే అయినా ఇవి రెండూ ప్రాణ స్నేహితులు. వీరి స్నేహం గురించి నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ ప్రత్యేకంగా చిత్రీకరించింది.
 
వివరాల్లోకి వెళితే.. అట్లాంటిక్‌ సముద్రంలోని టోరీ దీవుల సమీపంలో 'డగ్గీ' అనే డాల్ఫిన్‌తో పాటు మరో డాల్ఫిన్‌ ఉండేది. ఇద్దరు మంచి స్నేహితులు. అయితే.. అనుకోని ప్రమాదంలో డగ్గీ (డాల్ఫిన్) స్నేహితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్నేహితుడి మరణంతో ఒంటరిదైన డగ్గీకి.. అనుకోకుండా సముద్ర తీరంలో బెన్‌ (శునకం) పరిచయమైంది.

వీరి పరిచయం స్నేహంగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయింది. కానీ డగ్గీ నీటి నుంచి బయటికి రాలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న బెన్.. ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ప్రతిరోజూ సముద్రంలో కాసేపు డగ్గీకి ఆడుకుని వస్తుంది. 
 
అలా రోజూ సముద్ర తీరానికి రావడం డగ్గీ కనిపించగానే సముద్రంలోకి దూకి కాసేపు సరదాగా గడపడం దినచర్యగా చేసుకుంది బెన్‌. ఒక్కోరోజు మూడు గంటల సేపు నీటిలోనే ఈదుతూ కలిసి తిరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో కదిలే రైలులో యువతిపై అత్యాచారం.. లైంగిక దాడికి సహకరించకపోవడంతో దాడి..