Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

Advertiesment
Chinese maglev marvel

సెల్వి

, సోమవారం, 14 జులై 2025 (16:24 IST)
విమానంతో పోటీ పడే సరికొత్త రైలు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది చైనా. హైస్పీడ్ రైళ్లపై దృష్టిపెట్టిన డ్రాగన్ కంట్రీ  మరో అద్భుతం సృష్టించింది. ఇందులో భాగంగా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలును రూపొందించింది. తాజాగా 17వ మోడ్రన్ రైల్వే ఎగ్జిబిషన్‌లో మాగ్లెవ్‌ రైలును చైనా ప్రదర్శించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. 
 
కేవలం 7 సెకండ్లలోనే ఇది 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉండే 1200 కి.మీ దూరాన్ని కేవలం 2.30 గంటల్లో చేరుకుంటుందని అధికారులు అంచనా. 
 
మ్యాగ్నెటిక్‌ లివిటేషన్ (మాగ్లెవ్) టెక్నాలజీ సాయంతో ఈ రైలు అత్యధికంగా వేగంతో దూసుకెళ్లగలదు. ఈ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించి.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపేందుకు సాయపడుతుంది. దీంతో ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుగుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈ రైలు బరువు ఏకంగా 1.1 టన్నులుగా ఉండనుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర 
సృష్టించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?