థాయ్‌లాండ్‌లోని ఓ బేబీ డే కేర్ సెంటర్‌లో కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో 34 మంది మరణించారు. అందులో 22 మంది చిన్నారులే కావడం గమనార్హం.
కాగా, ఈ కాల్పుల ఘటన అనంతరం మాజీ పోలీసు అధికారి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో థాయ్‌లాండ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
అమెరికా తరహాలో థాయ్‌లాండ్‌లో విచ్చలవిడి కాల్పుల ఘటనలు చాలా అరుదు. 2020లో ఓ సైనికుడు ఓ ఆస్తి వివాదంలో ఆగ్రహం చెంది 29 మందిని కాల్చి చంపడం ఈ పర్యాటక దేశంలో సంచలనం సృష్టించింది.