Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ఆ డీటైల్స్ రాంగ్ నెంబర్‌కి పంపింది.. ఆపై ఏమైంది?

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంతోషకరమైన విషయాన్ని.. తన ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉన్నవారికందరికీ ఆమె పంపింది. బిడ్డతో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఓ రాంగ్ నెంబర్‌కి చేరాయి. సాధారణంగా

పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ఆ డీటైల్స్ రాంగ్ నెంబర్‌కి పంపింది.. ఆపై ఏమైంది?
, బుధవారం, 27 జులై 2016 (11:33 IST)
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంతోషకరమైన విషయాన్ని.. తన ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉన్నవారికందరికీ ఆమె పంపింది. బిడ్డతో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఓ రాంగ్ నెంబర్‌కి చేరాయి. సాధారణంగా రాంగ్ నెంబర్లు వస్తే.. లైట్‌గా తీసుకుని వదిలేస్తాం. అయితే ఆ రాంగ్ నెంబర్ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి మరి. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఇమ్ గుర్ అనే మహిళకు డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని తన ఫోన్‌లోని గ్రూప్ నంబర్స్‌కి ఎస్సెమ్మెస్ చేసింది. కానీ ఈ వివరాలు ఆమెకు పరిచయం లేని డెనీస్ విలియమ్స్ అనే అతనికి నంబర్‌కు చేరాయి. చేరిన వెంటనే అతను లైట్ తీసుకోలేదు. వెంటనే అతను తన సోదరుడితో కలిసి ఇమ్ గుర్‌కి డెలివరీ ఆస్పత్రికి.. పోస్ట్ చేసిన ఫోటో వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఊరకనే చేతులూపుకుంటూ వెళ్లలేదు. వాళ్లు షాకయ్యేంతగా బహుమతులతో వెళ్లాడు. దీంతో సదరు మహిళ సంబరపడిపోయింది. ఇంకేముంది..? రాంగ్ నెంబర్ వ్యక్తి డెనీస్ విలియమ్ బ్రదర్స్ ఇమ్ గుర్ కుటుంబంలో ఒకటైపోయారు. 
 
ఇమ్ గుర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మనచుట్టూ మనకు తెలియని ఎన్నో అద్భుతమైన కుటుంబాలు ఉన్నాయని.. అందుకు ఈ బ్రదర్స్ ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకొచ్చింది. ఈ స్టోరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అరగంటలో వైరల్ అయిపోయింది. మానవ సంబంధాలన్నీ మంట కలిసిపోతున్న తరుణంలో.. మానవతా విలువలకు అద్దం పట్టే వారు, మనకు తెలియకుండానే మన చుట్టూ మంచి మనుషులు ఉంటారని పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విహహేతర సంబంధం... ప్రేమికుల ఆత్మహత్య.. ఒకరి మృతి.. మరొకరు ఆస్పత్రిలో.. అనాథలైన పిల్లలు