Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్‌లో అల్లర్లకు 'జర్గర్'తో పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్... పసిగట్టిన భారత నిఘా వర్గాలు

కాశ్మీర్‌లో అల్లర్లకు పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది. ఇందుకోసం అహ్మద్ జర్గర్ అనే కరడుగట్టిన హంతకుడిని భారత్‌లోకి పంపించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. జర్గర్‌నే భారత్‌లోకి పంపించడానికి కారణాలు లేకపో

Advertiesment
Terrorist Mushtaq Ahmed Jargar
, గురువారం, 20 అక్టోబరు 2016 (14:32 IST)
కాశ్మీర్‌లో అల్లర్లకు పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది. ఇందుకోసం అహ్మద్ జర్గర్ అనే కరడుగట్టిన హంతకుడిని భారత్‌లోకి పంపించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. జర్గర్‌నే భారత్‌లోకి పంపించడానికి కారణాలు లేకపోలేదు.
 
నిజానికి జర్గర్ పేరు ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ, పాతతరం వారు మర్చిపోయిన పేరు. దాదాపు 40 మంది కాశ్మీరీ పండిట్లను చంపినట్లు అతడిపై హత్య కేసులున్నాయి. అలాంటివ్యక్తిని భారత్‌పైకి ప్రయోగించి.. మళ్లీ కాశ్మీర్‌లో అతడి ఉగ్ర నెట్‌వర్క్‌ను పునరుద్ధరించి, అతడి ఉగ్రవాద కార్యకలాపాలన్నింటికీ మద్దతు ఇవ్వాలని పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రణాళికలు రచించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
దీనికి నిదర్శనంగా గత శుక్రవారం శ్రీనగర్‌ శివార్లలో ఎస్‌ఎస్‌బీ జవాన్లపై కాల్పులు జరిపింది తామేనని జర్గర్‌ స్థాపించిన ‘అల్‌-ఉమర్‌-ముజాహిదీన్‌’ ప్రకటించడమే చెప్పుకోవచ్చు. ఈ జర్గర్‌పై హత్య కేసులో కాదు.. పెద్ద నేర చరిత్ర కూడా ఉంది. కాశ్మీర్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరి రుబయ్యాను 1989లో కిడ్నాప్‌ చేసింది జర్గరే కావడం గమనార్హం.
 
ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించడానికి హిజ్బుల్‌ మాజీ కమాండర్‌ బుర్హాన్‌ వనీ చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ ఆపరేషన్‌లో పెద్ద విజయం సాధించినట్లు బుర్హాన్‌వనీ సహా 12 మంది మిలిటెంట్లు ఆయుధాలు చేతబూని పరస్పర ఆలింగనంతో చిరునవ్వులు చిందిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సప్ గ్రూపులు - అసలు మీరేం చేస్తున్నారో మీకు తెలుసా...?