జయలలితకు అరుదైన గౌరవం.. అమెరికాలోని ఓ వీధికి డాక్టర్ జె.జయలలిత వే అనేపేరు..
అమెరికాలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అరుదైన గౌరవం దక్కింది. భారత దేశంలో చాలామంది జయలలితను అవినీతికి ప్రతిరూపంగా చూస్తుంటే.. షికాగోలోని బ్రాబ్‌వే అవెన్యూ, డెవన్ అవెన్యూ, నార్త్ షెరిడాన్ వీధులు క
అమెరికాలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అరుదైన గౌరవం దక్కింది. భారత దేశంలో చాలామంది జయలలితను అవినీతికి ప్రతిరూపంగా చూస్తుంటే.. షికాగోలోని బ్రాబ్‌వే అవెన్యూ, డెవన్ అవెన్యూ, నార్త్ షెరిడాన్ వీధులు కలిసే చోట ఒక వీధికి 'డాక్టర్ జె.జయలలిత వే' అని నామకరణం చేశారు.
వెస్ట్‌డెవన్ అవెన్యూలో జయలలితకు తోడుగా మహాత్మాగాంధీ, మహమ్మదాలీ జిన్నా, గోల్డామీర్‌ల పేర్ల మీద కూడా వీధులున్నాయి. జయలలిత నాయకత్వానికీ సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల ఆమెకున్న అంకిత భావానికీ గుర్తింపుగా ఈ గౌరవాన్నిస్తున్నట్లు అప్పటి ఇలినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గర్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాలు జనసంద్రమైంది. అమ్మతో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రముఖులు తరలివచ్చి చివరిసారిగా ఆమె పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. నటి గౌతమి మంగళవారం రాజాజీ హాలుకు చేరుకుని జయలలిత భౌతికకాయంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. జయలలిత ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని, అభిమానులు, ప్రజల గుండెల్లో ఆమ్మగా ఆమెకున్న స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదని గౌతమి వ్యాఖ్యానించారు.