Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గడ్డం పెంచడంలో విఫలం... 281 మంది సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు!

Taliban

ఠాగూర్

, బుధవారం, 21 ఆగస్టు 2024 (10:54 IST)
తాలిబన్ పాలకుల చర్యలు ఆశ్చర్యంగాను, వింతగా ఉంటాయి. వీటిని మరోమారు రుజువు చేసేలా వారు నిర్ణయం తీసుకున్నారు. 281 మంది భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. దీనికి ఓ వింత కారణం చూపించారు. కేవలం గడ్డం పెంచలేదన్న కారణంతో వారిని విధుల నుంచి తొలగించారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం తమ ప్రభుత్వం పనిచేసే ప్రతి ఒక్కరూ గడ్డం పెంచాల్సిందేనంటూ తాలిబన్ పాలకులు హుకుం జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, తాజాగా 281 మంది భద్రతా సిబ్బందిని తొలగించారు. 
 
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ రాజ్యం కొనసాగుతుంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం తమ ప్రభుత్వం పని చేసే ప్రతి ఒక్కరూ గడ్డం పెంచాల్సిందేనంటూ గతంలో ఉత్తర్వలు జారీచేశారు. లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఆ ప్రకారంగానే 281 మంది భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. సదరు ఉద్యోగులు గడ్డం పెంచడంలో విఫలం కావడమేనని, ఇలా వారికి గడ్డం లేని కారణంగా విధుల నుంచి తొలగించినట్టు పేర్కొంది. 
 
ఇక 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా మంత్రిత్వ శాఖను రద్దు చేసి నైతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది. ఈ మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత నుంచి అక్కడి ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ లేకుండాపోయింది. ముఖ్యంగా, మహిళళ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. మహిళలు హిజాబ్ ధరించనందుకు పలుమార్లు నైతిక మంత్రిత్వ శాఖ అధికారులు వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. దీంతో ఆ శాఖ తీరుపై మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్య సమితి బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. అయినప్పటికీ తాలిబన్ పాలకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. 1300 ఖాళీలు భర్తీ