Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Mi-24 అటాక్ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు..

Mi-24 అటాక్ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు..
, గురువారం, 12 ఆగస్టు 2021 (17:06 IST)
Taliban
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు విజృంభిస్తున్నారు. తాలిబ‌న్ ఫైట‌ర్లు దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా ఆఫ్ఘ‌నిస్థాన్ బ‌ల‌గాల‌కు ఇండియా గిఫ్ట్‌గా ఇచ్చిన Mi-24 అటాక్ హెలికాప్టర్‌ను కూడా తాము స్వాధీనం చేసుకున్న‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. 
 
ఈ హెలికాప్ట‌ర్ ప‌క్క‌న తాలిబ‌న్లు నిల‌బడి ఉన్న ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే దీనికి ఉండాల్సిన రోటార్ బ్లేడ్లు మాత్రం క‌నిపించ‌డం లేదు. తాలిబ‌న్లు దీనిని ఉప‌యోగించ‌కుండా ఉండేందుకు అంత‌కు ముందే ఆఫ్ఘ‌న్ బ‌ల‌గాలు వీటిని తొల‌గించిన‌ట్లు భావిస్తున్నారు.
 
2019లో ఈ Mi-24 అటాక్ హెలికాప్ట‌ర్‌ను ఇండియా ఆఫ్ఘ‌నిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చింది. దీంతోపాటు మూడు చీతా లైట్ యుటిలిటీ హెలికాప్ట‌ర్ల‌ను కూడా ఇచ్చింది. 2015లోనూ ఇలాగే నాలుగు అటాక్ హెలికాప్ట‌ర్ల‌ను ఇవ్వ‌గా.. ఈ Mi-24ను కూడా అందులో చేర్చింది. 
 
ఇప్ప‌టికే ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని 65 శాతం భూభాగాన్ని తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్న వేళ ఆఫ్ఘ‌న్ బ‌ల‌గాలు వారికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా అప్డేట్ : కొత్తగా 1859 కరోనా కేసులు