Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వీడెన్‌లో ఎలక్ట్రిక్ రోడ్డు.. 2030 కల్లా కాలుష్యరహిత వాహనాలే టార్గెట్.. భారత్‌కు ఎప్పుడో?

స్వీడెన్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ రోడ్డును ఆరంభించారు. కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు ఎలాంటి కాలుష్యం లేని పర్యావరణ హిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని స్వీడిష్ ట్రాన్స్ పోర్టు కంపెనీ అడ్

స్వీడెన్‌లో ఎలక్ట్రిక్ రోడ్డు.. 2030 కల్లా కాలుష్యరహిత వాహనాలే టార్గెట్.. భారత్‌కు ఎప్పుడో?
, శుక్రవారం, 1 జులై 2016 (12:53 IST)
స్వీడెన్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ రోడ్డును ఆరంభించారు. కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు ఎలాంటి కాలుష్యం లేని పర్యావరణ హిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని స్వీడిష్ ట్రాన్స్ పోర్టు కంపెనీ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ జనరల్ లీనా ఎరిక్సన్ తెలిపారు. సెంట్రల్ స్వీడెన్‌లో అక్కడి సర్కారు ట్రక్ కంపెనీల తయారీ సంస్థ అయిన స్కానియాతో కలిసి రెండు కిలోమీటర్ల మేర ఎలక్ట్రిక్ రోడ్డును నిర్మించింది. 
 
ఈ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ కేబుల్స్ సాయంతో అందే విద్యుత్తు ద్వారా బస్సులు, ట్రక్కులు నడుస్తున్నాయి. పర్యావరణహిత స్మార్ట్ రవాణా విధానానికి ఈ ఎలక్ట్రిక్ రోడ్లు దోహదం చేస్తాయని ఎరిక్సన్ పేర్కొన్నారు. సరికొత్త ఎలక్ట్రిక్ రోడ్ల టెక్నాలజీ భవిష్యత్‌లో రవాణారంగాన్ని మలుపు తిప్పుతుందని రవాణా రంగ నిపుణులు భావిస్తున్నారు.
 
2018 వరకు ఎలక్ట్రిక్ రోడ్ల టెస్టింగ్ జరుగుతుందని.. 2030 నాటికి పొగలేని.. కాలుష్య రహిత వాహనాలను రోడ్లపై నడిపటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎరిక్స్ వెల్లడించారు. ఇక ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో బస్సులు నడిపేటప్పుడు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటామని ఎర్రిక్స్ తెలిపారు. మరి భారత్‌కు ఇలాంటి రోడ్లు ఎప్పుడు వస్తాయో!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెల్ని ఈతకు పంపని తండ్రికి స్విస్ న్యాయస్థానం రూ.3 లక్షల జరిమానా