Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమార్తెల్ని ఈతకు పంపని తండ్రికి స్విస్ న్యాయస్థానం రూ.3 లక్షల జరిమానా

కుమార్తెలను ఈతకు పంపడానికి నిరాకరించిన ఓ తండ్రికి స్విస్ న్యాయస్థానం రూ.3 లక్షల జరిమానా విధించి సంచలన తీర్పునిచ్చింది. బోస్నియా నుంచి వలస వచ్చి 1990 నుంచి స్విట్జర్లాండ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి స్థానిక చ

కుమార్తెల్ని ఈతకు పంపని తండ్రికి స్విస్ న్యాయస్థానం రూ.3 లక్షల జరిమానా
, శుక్రవారం, 1 జులై 2016 (12:38 IST)
కుమార్తెలను ఈతకు పంపడానికి నిరాకరించిన ఓ తండ్రికి స్విస్ న్యాయస్థానం రూ.3 లక్షల జరిమానా విధించి సంచలన తీర్పునిచ్చింది. బోస్నియా నుంచి వలస వచ్చి 1990 నుంచి స్విట్జర్లాండ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి స్థానిక చట్టాలకు అనుగుణంగా నడచుకోవడం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. పాఠశాలలో నిర్వహించే క్యాంప్‌లకు పిల్లలను పంపకుండా.. మహిళలు ఈతలు కొట్టడం ముస్లిం మత విశ్వాసాలకు వ్యతిరేకమని అంటున్నాడని ప్రాసిక్యూషన్.. న్యాయమూర్తికి తెలిపారు. దీంతో అతనికి భారీ జరిమానా విధించడమైంది. 
 
గతంలో కూడా ఇతనిపై ఆరోపణలున్నప్పటికి కోర్టు అతడికి శిక్ష విధించలేదు. యేడాది క్రితం బురఖాలు ధరిస్తేనే తన బిడ్డలను స్కూలుకు పంపిస్తానని ఇతడు మొండికేసి కూర్చోవడంతో... కోర్టు ఏడాది జైలు శిక్ష విధించగా, మత స్వేచ్ఛ ఉండాలి కాబట్టి, బురఖా ధరించేందుకు అనుమతించాలని కోరడంతో స్విస్ సుప్రీంకోర్టు ఆ శిక్షను రద్దు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాడితో సెక్స్‌కు నో .. కానీ శృంగారమంటే ఇష్టం.. పడక సుఖం లేకుండానే తల్లినవుతా? : బ్రిటీష్ మోడల్