Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇష్టం లేని చదువు చదివిస్తే అమెరికాలోనూ రెబల్ కావల్సిందే మరి

ఆ పిల్లాడికి ఇంజనీరు కావాలని, డాక్టర్ కావాలని ఏ కోశానా ఆసక్తి ఉండదు. కానీ తల్లితండ్రుల బలవంతం మీద అదే చదువుతారు. మెదడు మొద్దుబారిపోతుంది. దారుణంగా జీవితాన్ని ముగించుకుని లోకం నుంచే వెళ్లిపోతారు. తామెక్కడ తప్పు చేశామన్న జ్ఞానం బిడ్డల్ని కోల్పోయాక కానీ

ఇష్టం లేని చదువు చదివిస్తే అమెరికాలోనూ రెబల్ కావల్సిందే మరి
హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (09:37 IST)
ఆ పిల్లాడికి ఇంజనీరు కావాలని, డాక్టర్ కావాలని ఏ కోశానా ఆసక్తి ఉండదు. కానీ తల్లితండ్రుల బలవంతం మీద అదే చదువుతారు. మెదడు మొద్దుబారిపోతుంది. దారుణంగా జీవితాన్ని ముగించుకుని లోకం నుంచే వెళ్లిపోతారు. తామెక్కడ తప్పు చేశామన్న జ్ఞానం బిడ్డల్ని కోల్పోయాక కానీ తెలీదు. ఇది ఇండియా కథే అనుకుంటే  పప్పులో కాలేసినట్లే. అమెరికాలోనూ ఇదే బలవంతపు చదువులు చదివిస్తున్నారని తెలిస్తే దిగ్బ్రాంతి కలుగుతుంది కానీ ఇది నిజం. 
 
దీనికి సజీవ ఉదాహరణ అమెరికాలో చోటు చేసుకుంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో న్యూయార్క్ నగరంలో చిన్న విమానం కూలిపోయింది. అది ఎందుకు కూలిపోయింది అంటూ విచారణ జరిపినప్పుడు గుండెలదిరిపోయే నిజం బయటపడింది. విమానం నడపటం నేర్చుకుంటున్న విద్యార్థి తన శిక్షకుడితో గొడవపడి గాల్లోనే దాన్ని వదిలేయడం వల్లే ఆ విమానం కూలిపోయిందని విచారణలో తేలింది. 
 
కారణం గురించి విచారిస్తే  విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ జమిలిగా చెంపదెబ్బలేసుకోవలసిన పరిస్థితి. ఆ విద్యార్థికి పైలట్ కావటం ఏమాత్రం ఇష్టంలేదు,.అయినా భారత్ లోలాగే తల్లి బలవంతం వల్లే అతడు పైలట్ శిక్షణ తీసుకున్నాడు. ఆ చిరాకుతోనే విమానం స్టీరింగును గాల్లోనే వదిలి శిక్షకుడితో గొడవపడి  విమానం కూలపోయేలా చేశాడని విచారణ కమిటీ కనుగొంది. 
 
దురదృష్టం ఏమిటంటే తనకు పైలట్ కోర్సే వద్దన్న ఆ కుర్రాడు ఆ ప్రమాదంలో చనిపోయాడు. ఆ ఇన్‌స్ట్రక్టర్ బతికి బయటపడ్డాడు, పిల్లలు ఏం చదవాలో తల్లిదండ్రులు నిర్ణయించి వారి శక్తికి, ఆసక్తికి మించిన భారం మోపితే కలిగే ఫలితాలు భారత్‌లో అయినా అమెరికాలో అయినా ఒకేలాగే ఉంటాయి. భారత్‌లో అయితే పిల్లలు ఆత్మహత్య చేసుకుని తాము మాత్రమే పోతారు. విదేశాల్లో పిల్లలు కాస్త దూకుడు స్వబావం కలిగిన వారు కాబట్టి వారు పోవడంతో పాటు తమతో పాటు కొందరిని తీసుకుపోతారు. తేడా అదే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక్కడా చంద్రబాబు పేరు వాడుకున్నారా.. బాంబు పేల్చిన కవిత!