Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దొంగల దాడి.. తీవ్రగాయాలతో వీడియో...

Advertiesment
Indian Student

సెల్వి

, బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (14:17 IST)
Indian Student
అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి చెందుతున్న ఘటనలను మరవకముందే.. మరో తెలుగు విద్యార్థి దొంగలచే దాడికి గురయ్యాడు. గత నెల రోజులుగా అమెరికాలో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు శవమై కనిపించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చికాగోలో నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్న సయ్యద్ మజాహిర్ అలీ, ఆదివారం ఉదయం క్యాంప్‌బెల్ అవెన్యూలో వెళ్తుండగా ముగ్గురు దొంగలు దాడి చేసి దోచుకున్నారు.
 
హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో నివసించే అలీ భార్య సయ్యదా రుక్వియా ఫాతిమా రజ్వీ మంగళవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఉత్తమ వైద్యం అందించడంలో సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
తమ ముగ్గురు మైనర్ పిల్లలతో కలిసి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రికి రాసిన లేఖలో అలీ భార్య అభ్యర్థించారు. తన భర్త అపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్నప్పుడు క్యాంప్‌బెల్ అవెన్యూలో దాడి చేసి దోచుకున్నారని అతని స్నేహితుడి నుండి తనకు కాల్ వచ్చిందని ఆమె చెప్పారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు.
 
భర్తకు ఇలా జరిగిందని షాక్‌లో ఉన్నానని, ఆయనతో మాట్లాడలేకపోయానని ఫాతిమా తెలిపారు. తన భర్త భద్రత గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆమె రాసుకొచ్చారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో అలీ రోడ్డుపై నడుస్తుండగా, ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు అతడిని వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వీడియో క్లిప్‌లో రక్తస్రావంతో బాధితుడు సంఘటనను వివరించాడు. 
 
ఫుడ్ ప్యాకెట్‌తో ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. "నేను నా ఇంటి దగ్గర దాడికి గురయ్యాను. నాపై తీవ్రంగా దాడి చేశారు. నా మొబైల్ ఫోన్ లాక్కున్నారు, సహాయం కోసం వేడుకున్నాడు.. ముక్కు, నుదుటిపై తీవ్రగాయాలు అయ్యాయి..." అని చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే రోజు 157 కోవిడ్-19 కేసులు.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మృతి