Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన తోకను తానే మింగిన పాము.. వీడియో వైరల్

Advertiesment
తన తోకను తానే మింగిన పాము.. వీడియో వైరల్
, మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:51 IST)
సాధారణంగా చిన్న చిన్న జలచరాలను పాములు ఆరగించడం చూస్తుంటాం. కానీ, ఓ పాము తన తోకను తానే మింగేసింది. ఈ ఆసక్తికర సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అమెరికాలోని పెన్సిల్వేనియాలో సరీసృపాల అభయారణ్యం ఒకటి ఉంది. ఇక్కడ ఓ పాము తన తోకను తానే మింగుతున్న వైనాన్ని స్నేక్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన జీస్సే రోథాకర్‌ కంటికి కనిపించింది. దీంతో ఆయన అప్రమత్తమై దాన్ని వీడియో తీశాడు. 
 
పైగా, ఆ పాము నోట్లో నుంచి తోకను బయటకు తీసేందుకు సుమారు 5 నిమిషాల పాటు శ్రమించాడు. పాము తలపై నెమ్మదిగా నిమరడంతో.. అది కూడా నెమ్మదిగా తన నోట్లో నుంచి తోకను బయటకు తీసింది. 
 
అయితే ఈ జాతికి చెందిన పాములు ఇతర జాతులకు చెందిన పాములను మింగేస్తుంటాయని జీస్సే చెప్పుకొచ్చాడు. ఈ తోక వేరే పాముదై ఉండొచ్చని తనకు తానే తెలియకుండా.. తన తోకనే మింగేసిందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండిగో ఫ్లైట్‌కు టేకాఫ్ సమస్య... మంత్రి నితిన్ గడ్కరీకి తప్పిన ముప్పు