Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రహాంతర వాసులతో స్నేహం మానవ జాతికి చేటు

గ్రహాంతర వాసులను గురించి తెలుసుకోవాలని, వారితో సంబంధాలను కొనసాగించాలనీ నేటి శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో వారికి దూరంగా ఉండటమే మంచిదని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హ

గ్రహాంతర వాసులతో స్నేహం మానవ జాతికి చేటు
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (18:16 IST)
గ్రహాంతర వాసులను గురించి తెలుసుకోవాలని, వారితో సంబంధాలను కొనసాగించాలనీ నేటి శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో వారికి దూరంగా ఉండటమే మంచిదని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ‘స్టీఫెన్ హాకింగ్స్‌ ఫేవరెట్‌ ప్లేసెస్‌’ పేరుతో విడుదల చేసిన ఆన్‌లైన్‌ చిత్రంలో హాకింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
భూగోళం మీద ఆధునిక మానవులు కొలంబస్‌ నాయకత్వంలో అమెరికా సంతతి ప్రజల్ని కలిసినప్పుడు సంభవించిన పరిస్థితులను ఇందుకు ఉదాహరణగా ఆయన వివరించారు. అప్పట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆధునిక మానవులు, అమెరికా సంతతి ప్రజల్ని అణిచివేశారని హాకింగ్ గుర్తుచేశారు. మానవుల కంటే బలమైన గ్రహాంతరవాసులు భూమి ఉనికి పసిగట్టి, భూమి పైకి వస్తే అవే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హాకింగ్ హెచ్చరించారు. 
 
గ్రహాంతరవాసులు మానవుల కంటే చాలా బలవంతులని, వారి ముందు మనుష్యులు ఎందుకూ పనికిరారని, వాళ్ళు మానవులను బ్యాక్టీరియాలా నీచంగా చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విశ్వంలో మానవులు ఒంటరివాళ్లం కాదని, ఇంకా అనేక గ్రహాల్లో జీవం ఉంటుందని ఆయన తెలిపారు. గ్రహాంతరవాసులతో సఖ్యత కొరకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలకు ఈ వార్త ఆసక్తిని, ఆందోళనను కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్ పిచ్చి పీక్స్‌కు వెళుతోందా... అమ్మాయి ఏకే 47తో మోదికి వార్నింగ్(Video)