Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌కు శ్రీలంక షాక్.. సార్క్‌ సభలకు రాబోయేది లేదట.. అఫ్రిది ఏమంటున్నాడంటే?

ఉగ్రవాదులను ప్రోత్సాహిస్తూ.. వారి ఆగడాలకు బ్రేక్ వేయకుండా మిన్నకుండిపోయింది. ఇందుకు భారత్ తగిన బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకలను ఏరివేసింది. జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్‌లోని ఆర్మ

Advertiesment
Sri Lanka pulls out of Saarc summit in Islamabad
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:43 IST)
ఉగ్రవాదులను ప్రోత్సాహిస్తూ.. వారి ఆగడాలకు బ్రేక్ వేయకుండా మిన్నకుండిపోయింది. ఇందుకు భారత్ తగిన బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకలను ఏరివేసింది. జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలన్న మోడీ సర్కారు విధానానికి ప్రపంచ దేశాలు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాల మద్దతు తగ్గిపోతుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు శ్రీలంక షాకిచ్చింది. కాస్త లేట్‌గా ఇచ్చినా లేటెస్ట్‌గా ఇచ్చింది. నవంబర్ 9, 10 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ దేశాల సదస్సుకు హాజరుకాలేమని స్పష్టం చేసింది. 
 
సార్క్ సదస్సు విజయవంతమయ్యే వాతావరణం కనపడటం లేదంటూ సదస్సుకు హాజరుకాలేమని తెలిపింది. పాక్ మైనస్ సార్క్ విధానం అవలంభిస్తున్న మోదీ సర్కారుకు శ్రీలంక తాజా చర్య మద్దతిచ్చేదిగా మారింది. తొలుత ఆఫ్ఘనిస్థాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్, భూటాన్ సార్క్ సదస్సుకు హాజరు కాలేమని ప్రకటించేసిన సంగతి తెలిసిందే. 
 
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ఇటు భారత్, అటు పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు సరిహద్దుల వద్ద సైన్యాన్ని మోహరిస్తున్నాయి. క్షణక్షణం ఉద్రికత్తలు మరింత పెరుగుతున్న వేళ పాకిస్థాన్ మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్స్‌మన్ షాహిద్ ఆఫ్రిది ట్విట్టర్‌లో స్పందించాడు. యుద్ధానికి దిగడం వల్ల రెండు దేశాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని, సంయమనం పాటించాలని సూచించాడు. 
 
నియంత్రణ రేఖ వద్ద ఉద్రికత్తలు తగ్గించి శాంతి నెలకొనేలా రెండు దేశాలు చర్యలు తీసుకోవాలని అఫ్రిది కోరాడు. పాకిస్థాన్ శాంతికాముక దేశమని, అందరితో శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమే ఉండదని పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ కాళ్ళబేరం... ప్లీజ్.. యుద్ధం వద్దు.. మాట్లాడుకుందాం రండి.. నవాజ్ షరీఫ్ నోట...శాంతి మాట..!