Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబ్బుంటే చాలు.. ఇక రాకెట్ ప్రయాణం కూడా ఈజీ.. ప్రయోగం సక్సెస్

డబ్బుంటే చాలు.. ఇక రాకెట్ ప్రయాణం కూడా ఈజీ.. ప్రయోగం సక్సెస్
, సోమవారం, 16 నవంబరు 2020 (10:52 IST)
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి స్పేస్‌ ఎక్స్ క్రూ డ్రాగన్ 'రేసేలీన్స్' నుండి నలుగురు వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలోకి చేరుకున్నారు. ముగ్గురు అమెరికన్లు - మైఖేల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, షానన్ వాకర్ - జపాన్ దేశపు వ్యోమగామి సోచి నోగుచి ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి రాత్రి 7:27 గంటలకు దీనిని ప్రయోగించారు. తద్వారా ఈ రైడ్ల కోసం రష్యాపై అంతర్జాతీయంగా ఆధారపడుతూ వస్తోన్న ఒక దశాబ్దపు శకం ముగిసింది. 
 
ఇక ఈ ప్రయోగం మీద అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఓల తన భార్య కరెన్‌తో కలిసి ఈ ప్రయోగానికి హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దీనిని అమెరికాలో మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో, ప్రభుత్వం నడిపే అంతరిక్ష నౌకల మీద ఆధారపడే బదులు, నాసా వ్యోమగాములు లేదా తగినంత డబ్బు ఉన్న ఎవరైనా వాణిజ్య రాకెట్‌‌లో టికెట్ కొనుగోలు చేయవచ్చు.
 
మే 30న మొదటి ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో అన్ని జాగ్రత్త చర్యలను తీసుకున్నట్లు స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎలోన్‌ మస్క్‌ అన్నారు. ఈ ప్రయోగం సాంకేతిక శక్తికి నిదర్శనమని ఇటీవల అమెరికా ఎన్నికలో విజయం సాధించిన డెమోక్రాట్‌ అభ్యర్థి బిడెన్‌ ట్వీట్‌ చేశారు. గ్రేట్‌ అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.
 
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌, తన భార్య కరెన్‌తో కలిసి ఈ ప్రయోగానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకమని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కేసులు తగ్గాయ్.. కానీ 435 మంది మృతి